Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 February 2025, 5:48 pm Posted by : ramakrishna

మహారాష్ట్ర నుండి కాశీ వరకు యువతి స్కెటింగ్ యాత్ర

రుద్రూర్, బతుకమ్మ : మహారాష్ట్ర నుండి కాశీ వరకు సోనీ చౌర్సియా అనే యువతి స్కెటింగ్ చేస్తూ ప్రయాణిస్తారని, మహారాష్ట్ర నుండి బయలుదేరి దెగ్లూర్,  పోతంగల్, కోటగిరి మీదుగా రుద్రూర్ కు చేరుకుంది. రుద్రూర్ మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో మంగళవారం కామారెడ్డి బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజు, బిజెపి మండల అధ్యక్షులు హరికృష్ణ, బిజెపి నాయకులు సోనీ చౌర్సియా, ఆమె గురువుకు శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశం కోసం, హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మాన్ని హిందువులు కాపాడాలని, మహారాష్ట్ర నుంచి కాశీ వరకు స్కేటింగ్ ద్వారా ప్రయాణిస్తానని అన్నారు. ప్రతిరోజు 130 నుంచి 140 కిలోమీటర్ల ప్రయాణం చేస్తానని ఆమె పేర్కొన్నారు. దేశంలోని 20 రాష్ట్రాలు 10,550 కిలోమీటర్లు స్కేటింగ్ ద్వారా  ప్రయాణం చేస్తానన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి పలు సమస్యలపై విన్నవిస్తానని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్,  బిజెపి నాయకులు కటికే రామ్ రాజ్, గణేష్, పార్వతి మురళి, వడ్ల సాయినాథ్, అనీల్, బిజెపి పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.