Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 5:40 pm Posted by : ramakrishna

మహిళలకు న్యాయం చేసే విధంగా మహిళా సంఘం ఉంటుంది

 

. . . విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం నూతన జిల్లా మహిళ కమిటీ నియమకం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మహిళలు మరింత ముందుకు వెళ్లాలని, మహిళలకు న్యాయం చేసే విధంగా మహిళా సంఘం ఉంటుందని మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు మడుపు స్వప్న అన్నారు. విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ప్రైవేట్ కార్యాలయంలో జిల్లా కమిటీ మహిళా సంఘానికి నియామక పత్రాలు అందజేశారు. నూతనంగా జిల్లా మహిళా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షులు కిషన్, ప్రధాన కార్యదర్శి సుద్దాల శ్రీనివాస్, కోశాధికారి నూనె వేణుగోపాల్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలుగా మడుపు స్వప్న, ప్రధాన కార్యదర్శి పాదం మాధవి, కోశాధికారి లత, ఉపాధ్యక్షురాలు సంబోజి కృష్ణవేణి, లీగల్ అడ్వైజర్ జి ఝాన్సీ రాణి, ప్రధాన కార్యదర్శి స్వర్ణలత, వర్కింగ్ ప్రెసిడెంట్ రుద్రాజడ స్వప్న, అలాగే సహాయ కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, ముఖ్య సలహాదారు, సలహాదారులను, టౌన్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షురాలు నూతన కమిటీలను నియమించి వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

 

A women's association exists to provide justice to women.