ఇంటిని నందనవనం చేసే వ్యక్తి మహిళ
బతుకమ్మ,మోర్తాడ్: కనులు తెరిచిన క్షణం నుంచి బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం, అందర్నీ కనుపాపలా తలంచి ఆత్మీయత పంచి తన వారి కోసం అహర్నిశలు కష్టించి వారిని సహించి వారి భవిష్యత్తు గురించి తన ఇంటిని నందనవనం చేసే వ్యక్తి మహిళని మోర్తాడు ఎంపీడీవో తిరుమల దేవి అన్నారు. మహిళా దినోత్సవంను పురస్కరించుకొని శనివారం మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రత్యేక మహిళ గ్రామ సభను ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ సిబ్బందిని, పంచాయతీ కార్యదర్శులను, అంగన్వాడి టీచర్లను, ఆరోగ్య...