నిజామాబాద్, బతుకమ్మ : నూతనంగా డీఎస్సీ 2024లో ఎంపికైన వ్యాయామ ఉపాధ్యాయులకు పేట ఆధ్వర్యంలో నగరంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో శుక్రవారం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు టి.విద్యాసాగర్ రెడ్డి మాట్లాడారు. నూతనంగా పాఠశాలల్లో చేరి వ్యాయామ ఉపాధ్యాయులుగా విధుల సక్రమంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు ఎ.రవీందర్, నాంచారి శ్రీనివాస్, ఎ.రమేష్ పాల్గొన్నారు.