హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం
బతుకమ్మ, నిజామాబాద్ : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుజోయ్ పాల్, జె.శ్రీనివాస్ రావు శనివారం నిజామాబాద్ పర్యటనకు హాజరైన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. జిల్లా కోర్టు భవన సముదాయంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కాన్ఫరెన్స్ హాల్ లో మూడు రోజుల పాటు కొనసాగిన కమ్యూనిటీ మీడియేటర్ల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముందుగా వారు స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్దకు చేరుకుని, పోలీసుల నుండి గౌరవ...