రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ కు ఘన స్వాగతం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : సమాచార హక్కు చట్టం - 2005 పై పీఐఓలకు, ఏపీఐఓలకు, అన్ని శాఖల అధికారులకు అవగాహన కల్పించేందుకు శుక్రవారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరైన రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డికి, కమిషనర్లు దేశాల భూపాల్, పీ.వీ.శ్రీనివాస్ రావులకు జిల్లా అధికారులు, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి నేతృత్వంలో ఆ సంఘం...