Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 March 2025, 6:43 pm Posted by : ramakrishna

చేనేత సహకార సంఘాన్ని సందర్శన

రుద్రూర్, బతుకమ్మ : మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘాన్ని సోమవారం హ్యండ్ లూమ్ టెక్స్ టైల్స్ డవలప్మెంట్ అధికారులు వెంకటేశ్వర్లు, హేమలత పరిశీలించారు. ఈ సందర్బంగా నేత కార్మికులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికుల కోసం అమలు చేస్తున్న పథకాల గూర్చి వివరించారు.  చేనేత  కార్మికులు వేతనాల నుండి నెలవారీగా 8 శాతం కాంట్రిభ్యూషన్ చేస్తే ప్రభుత్వం రెండింతలు జమ చేస్తుందన్నారు. గతంలో మూడేళ్ల వరకు పొదుపులు వ్యవధి ఉండగా దీన్ని రెండేళ్లకు ప్రభుత్వం తగ్గించిందని వివరించారు. తెలంగాణ నేతన్న పొదుపు పథకం, నేతన్న భద్రత, నేతన్న భరోసా పథకాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీడీఈలు ఎస్. నరేందర్, ఎస్. వేణు, చేనేత సంఘం అధ్యక్షుడు మోత్కురి నారాయణ, సంఘ మేనేజర్ ఈర్వ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

A visit to a handloom co-operative society