ప్రారంభానికి నోచుకోని పల్లె దవాఖానా
ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల గ్రామంలో గత ప్రభుత్వం లో చేపట్టిన పల్లె దవాఖానా పూర్తి అయి ఆరు నెలలు పూర్తి అవుతున్న ప్రారంభానికి నోచుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలలో చిన్న చిన్న రోగాలకు కూడా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి కి వెళ్లాల్సి వస్తుందని,ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి,సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.