ఆ అధికారిపై విజిలెన్స్ కన్ను
ఇటీవల వరుస ఆరోపణల నేపథ్యంలో విచారణ బయటకు పొక్కనివ్వని యంత్రాంగం నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ఇటీవల విజిలెన్స్ అధికారులు విచారణ జరిపిన వ్యవహరం వెలుగులోకి వచ్చింది. బతుకమ్మ దినపత్రికలో వచ్చిన కథనాల నేపథ్యంలో ఒక శాఖకు చెందిన అధికారి, యూనియన్ నేత వ్యవహర శైలిపై నిఘా వర్గాలు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాయి. దాంతో విజిలెన్స్ శాఖ ఆధ్వర్యంలో విచారణ జరిపినట్లు తెలిసింది. నిజామాబాద్ జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా కదలకుండా ఉండి సామాజిక వర్గం అండతో యూనియన్ నేతగా చక్రం తిప్పుతున్న...