Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 April 2025, 8:24 pm Posted by : ramakrishna

అమరుల ఆత్మశాంతికి కొవ్వత్తుల ర్యాలీ

  • పహాల్ గావ్ అమరులకు జోహార్, జోహార్
  • గ్రామ గ్రామాన జోహారులర్పించిన యువకులు

 

భీమ్ గల్, బతుకమ్మ : కాశ్మీర్ లోని పహాల్ గావ్ వద్ద పాకిస్థాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో అసువులు బాసిన 28 మంది హిందు పర్యాటకుల ఆత్మ శాంతించాలని కోరుతూ బుధవారం  బాల్కొండ కానిస్టేన్సీలో భీమ్ గల్, మోర్తాడ్, వేల్పూర్, కమ్మర్ పల్లి, బాల్కొండ, మెండోరా, ముప్కాల్, ఎర్గట్ల మండల కేంద్రాలతో పాటుగా అన్ని గ్రామాల్లో కొవ్వత్తిల ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని యువకులు ఈ కొవ్వత్తుల ర్యాలీలు నిర్వహించి అమరులకు జోహార్లు తెలిపారు. ఈ సందర్బంగా రెండు నిమిషాలు మౌనం పాటించి, భారత్ జెండాలను పట్టుకొని ర్యాలీలు నిర్వహించి, పాకిస్తాన్ మూర్ధ బాద్, పహాల్ గావ్ అమరులకు జోహార్, కాబర్ధార్ ఖబర్ధార్ పాకిస్తాన్ ఖబర్దర్, హిందువుల ఐక్యత వర్ధిల్లాలి  అంటూ నినాదాలు చేశారు. ఘటన కు కారకులైన నరహంతకులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని కోరారు. అమరుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు. ఈ కొవ్వత్తుల ర్యాలీల్లో పార్టీలకు అతీతంగా అందరు హిందు యువకులు, పెద్దలు, చిన్నలు పాల్గొన్నారు.