Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 August 2025, 7:37 pm Posted by : ramakrishna

విందుకోసం వెలుతున్న వాహనం బోల్తా

 డిచ్ పల్లి, బతుకమ్మ : వివాహ విందుకోసం డిసియం లో వెలుతున్న డిసీయం వాహనం బోల్తా కొట్టింది. ఈసంఘటన గురువారం సాయంత్రం డిచ్ పల్లి మండలం మిట్టపల్లి గ్రామ శివారులో జరిగింది. ఇందల్వాయి మండలం మల్లాపూర్ కు చెందిన వివాహ విందు వేడుకలు నిజామాబాద్ నగరంలోని అర్సపల్లిలో గురువారం సాయంత్రం జరగనున్నాయి. దానికోసం మల్లాపూర్ నుంచి బందువులు, మిత్రులతో కలిసి వెలుతున్న పెళ్లి బ్రందం ప్రయాణిస్తున్న డిసీయం డ్రైవర్ అజాగ్రత్తగా నడుపడంతో పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 10 మంది వరకు గాయాలు అయ్యాయి. వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం మత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని తెలిసింది.