బాల్య స్మృతులతో ఆనందభాష్పాల అపూర్వ కలయిక

లచ్చ పేటలో మొదటి ఎస్ ఎస్ సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం  బతుకమ్మ, మాచారెడ్డి: దాదాపు 22 ఏళ్ల తర్వాత కలయిక... చదువులమ్మ ఒడిలో కుదిరిన స్నేహ బంధపు మధుర జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఆనందభాష్పాల ను పంచుకున్నారు.  మాచారెడ్డి మండలం లచ్చ పేట గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2001-02 మొదటి పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకున్నారు. గ్రామంలో పూర్వ విద్యార్థుల సమ్మేళన నిర్వహణకు వారు నాంది పలికారు. తమ గురువులను ఈ సమ్మేళనానికి ఆహ్వానించి వారికి శాలువాతో...