Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 February 2026, 7:43 pm Posted by : ramakrishna

సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అనుకూలమైన కేంద్ర బడ్జెట్

 

. . . ఈ బడ్జెట్ వల్ల దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు చేకూరుతుంది

 

. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఆదివారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలోని అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరుతుందని, ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలకు ఈ బడ్జెట్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. రైతులకు, అలాగే రోజువారి పనులు చేసుకునే వారికి ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగదాయకమని ఆయనన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ తో దేశం మరికొన్ని రోజుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ప్రపంచంలోనే అన్ని దేశాలకు మార్గదర్శకంగా నిలిచి ప్రపంచ దేశాల సరసన నిలబడడం ఖాయమన్నారు. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడుకి ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల ఉపయోగం చేకూరుతుందని ఆయనన్నారు. ఇప్పటివరకు ఏ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచనలతో ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్ ను రూపొందించారని ఎమ్మెల్యే కొనియాడారు. బడ్జెట్ పై ప్రతిపక్షాలు చేస్తున్న కల్పితాలను ప్రజలు నమ్మకూడదని ఈ బడ్జెట్ కేవలం దేశాభివృద్ధి కోసమేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.