Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 2:10 pm Posted by : ramakrishna

భగత్ సింగ్ ఆశయాల సాధనకే నిజమైన నివాళి

 

.  .  .   భగత్ సింగ్ విగ్రహానికి ఆర్ ఎస్ పీ, ఏఐపీఎస్ యు, ఆర్ వై ఎఫ్ నేతల పిలుపు

 

నిజామాబాద్ సిటీ,  బతుకమ్మ : 

 ననగరంలోని  ఆర్సపల్లి భగత్ సింగ్ చౌరస్తా వద్ద అమర వీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల విగ్రహాలకు సోమవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్జి ఎస్ పీ జిల్లా  కన్వీనర్ కటారి రాములు,  రాష్ట్ర అధ్యక్షులు బోడ. అనిల్, ఆర్ వై ఎఫ్ జిల్లా కన్వీనర్ పిట్ల నరేష్ పాల్గొని మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లు దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహా విప్లవ వీరులని పేర్కొన్నారు. వారి త్యాగస్ఫూర్తిని, పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విద్యా, వైద్య, ఉపాధి రంగాలలోని ప్రజావ్యతిరేక విధానాలు సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని విమర్శించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఏకమై, సమష్టిగా పోరాడి తమ హక్కులను సాధించుకోవాలని అన్నారు. విద్యను అందరికీ అందుబాటులో ఉంచడం, వైద్య సేవలను ప్రజలకు ఉచితంగా లేదా తక్కువ ధరలో అందించడం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు.అమర వీరుల ఆశయాలను సాధించేందుకు ప్రజలు, ముఖ్యంగా విద్యార్థి-యువజనులు ముందుకు వచ్చి ఉద్యమాలు చేపట్టాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపాల్ సింగ్ ఠాగూర్, నాగభూషణం, రాహుల్, సూర్య పాల్, చరణ్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.