Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 September 2025, 2:01 pm Posted by : ramakrishna

ప్రజాకవి కాళోజీకి ఘన నివాళి

నిజామాబాద్,బతుకమ్మ : ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనం (న్యూ కలెక్టరేట్)లోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన జయంతి వేడుకల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం, కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాళోజీ నారాయణ రావు అందించిన సేవలను వక్తలు కొనియాడారు. అంతకుముందు వర్ని చౌరస్తాలో గల కాళోజీ విగ్రహానికి కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమములో అదనపు కలెక్టర్ అంకిత్, బీ.సీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

A tribute to the popular poet Kaloji