Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 September 2025, 5:56 pm Posted by : ramakrishna

మహానేతకు ఘన నివాళి

బతుకమ్మ, బిచ్కుంద : బిచ్కుంద మండల కేంద్రంలోని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ యాడ్ లో మ‌హానేత వైయస్సార్ వ‌ర్ధంతి కార్యక్రమం  నిర్వ‌హించారు. బిచ్కుంద కాంగ్రెస్ పార్టీ నాయకులు మ‌హానేత విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధర్పల్ గంగాధర్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఫీజు రీంబర్స్మెంట్ ఇలా ఎన్నో పథకాలతో, బడి ఈడు పిల్లల నుండి పండు ముసలివారి వరకు సంక్షేమ సారధిగా పేదల ఎదుగుదలకు బాటలు వేసిన మహనీయుడు ఆ దివంగత నేత వై.యస్ రాజశేఖర్ రెడ్డి గారని, వారి భౌతికంగా మనకు దూరం ఉన్నా, వారి పథకాల ద్వారా లబ్ది పొందిన ప్రతి ఒక్కరి చిరునవ్వులో ఎప్పటికి కలకాలం నిలిచి ఉంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిని అశోక్, నౌషా నాయక్, సహిల్ షట్కర్, ఖలీల్, చింతల హనుమాన్లు, సీమ గంగారం, రేణిగుంట నాగరాజు, గౌస్ సెట్, మంచివారి యోగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.