శ్రీకాంత్ చారి కి ఘన నివాళి

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :  తెలంగాణ తొలి అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు.  నగరంలోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నాయకులు శ్రీకాంతా చారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా  తెలంగాణ జాగృతి నాయకులు అవంతి కుమార్ మాట్లాడుతూ  ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా  అర్పించిన అమరు వీరుడు కాసోజు శ్రీకాంతా చారి అని పేర్కొన్నారు.  కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు శేఖర్ రాజు ,కరిపే రాజు ,మీసాల శంకర్ , ఎండల...