నిజామాబాద్, బతుకమ్మ : సావిత్రిబాయి పూలే 195వ జయంతిని శనివారం జిల్లా కేంద్రంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ మహానీయుల పార్కులో గల సావిత్రిబాయి పూలే విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ స్త్రీలు చదువుకుంటే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆడబిడ్డలకు చదువు నేర్పిన మహనీయురాలు సావిత్రి బాయి ఫూలే అని పేర్కొన్నారు. దాదాపు 52 పాఠశాలలు స్థాపించిందన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు బుస్స ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, దర్శనం దేవేందర్, మాడవేడి వినోద్ కుమార్, కొయ్యాడ శంకర్, శ్రీలత, చంద్రకాంత్, సాయి బసవ, రమణ స్వామి, రమేష్, మోహన్, నరసయ్య, శ్రీనివాస్, రుక్మిణి, రేఖ, సురేందర్ అనిల్ గంగాధర్ ఆదె ప్రవీణ్, దారం భూమన్న, తదితరులు పాల్గొన్నారు.