నెహ్రూకు ఘన నివాళి
నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ నాయకులు దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, రాష్ట్ర ఎన్ఎస్ యూఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్ మాట్లాడుతూ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని నెహ్రూ దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించారన్నారు. పంచవర్ష ప్రణాళిక ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారన్నారు. నెహ్రూ భూపునఃపంపిణీ విధానాన్ని అనుసరించడంతో పాటు నీటిపారుదలకు...