Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 May 2025, 1:25 pm Posted by : ramakrishna

నెహ్రూకు ఘన నివాళి

నిజామాబాద్, బతుకమ్మ :  కాంగ్రెస్ పార్టీ నాయకులు దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, రాష్ట్ర ఎన్ఎస్ యూఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్ మాట్లాడుతూ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని నెహ్రూ దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించారన్నారు. పంచవర్ష ప్రణాళిక ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారన్నారు. నెహ్రూ భూపునఃపంపిణీ విధానాన్ని అనుసరించడంతో పాటు నీటిపారుదలకు కాలువలు తవ్వించడం, ఆనకట్టలు కట్టించడం , వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపట్టారన్నారు.   శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నెహ్రూ గారు నిజామాబాద్ జిల్లాకు వచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నెహ్రూ  ఆశయాలను ప్రజలకు వివరించాలని సూచించారు.  కార్యక్రమంలో జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్,ఫిషర్మాన్ చైర్మన్ శ్రీనివాస్,మాజీ ఎంపీపీ దశ గౌడ్, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు వినయ్,మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉష,జిల్లా ప్రతినిధి లవంగ ప్రమోద్, అవిన్,నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నరేందర్ గౌడ్,నరేంద్ర సింగ్,స్వామి గౌడ్,పుప్పాల విజయ,సంగెం సాయిలు,ముశ్షు పటేల్, సాయి కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.


A tribute to Nehru