మండల యువజన నాయకుడికి సన్మానం

బతుకమ్మ,మోర్తాడ్: నూతనంగా ఎన్నికైన మోర్తాడ్ మండల యువజన నాయకుడు అడవల మనోజ్ ను ఆదివారం శేట్ పల్లీ గ్రామ యువకులు శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. జీవితంలో మరెన్నో పదవులు చేపట్టాలని యువతకు ఆదర్శంగా మనోజ్ నిలవాలని కోరుకున్నారు. కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ రంజిత్, యువ నాయకులు బద్దం దేవేందర్, గురిజాల నర్సారెడ్డి, బబ్బురి నవీన్, శ్రీకాంత్, నిషిత్, సిద్ధార్థ, అంకిత్ తదితరులు పాల్గొన్నారు.