Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 April 2025, 12:48 pm Posted by : ramakrishna

హోమియో పితామహుడు హనీమన్ కు ఘన నివాళి

నిజామాబాద్, బతుకమ్మ : ప్రపంచ హోమియో దినోత్సవాన్ని గురువారం జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు. ఆస్పత్రి నాలుగో అంతస్తులో హోమియో పితామహుడు డాక్టర్ శామ్యూల్ హనీమన్ చిత్రపటానికి ఆయుష్ జిల్లా ఇన్ చార్జి డాక్టర్ జె.గంగదాసు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియోపతి వైద్య విధానాన్ని మానవ జాతికి అందించినందుకు హనీమన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నమన్నారు. ఈ కార్యక్రమం లో డీపీఎం వందన, డాక్టర్ తిరుపతి, ఆయుష్ ఫార్మ సిస్ట్స్ లు న్యావానంది పురుషోత్తం,ఉమాప్రసాద్, నీరజ, భిక్షపతి, రమేష్, జిల్లా ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.