Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 December 2024, 5:04 pm Posted by : ramakrishna

బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయునికి సన్మనం

బతుకమ్మ,ఏర్గట్ల: ఏర్గట్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎస్సీ కాలనీ లో గత కొన్ని సంవత్సరాల నుండి  కొండూరు సుధాకర్ ఉపాధ్యాయిడి గా విధులు నిర్వహిస్తున్నాడు. బదిలీల్లో భాగంగా  కొండూరు సుధాకర్ ఎం పీ పీ ఎస్ మచ్చర్ల గ్రామానికి బదిలీ కావడం జరిగింది. బదిలీ అయిన సందర్భంగా పాఠశాల బృందం స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయుడు సుధాకర్ ను శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు తమతో మెదిలిన జ్ఞాపకాలను తమకు విద్యాబుద్ధులు నేర్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు  వరుణ్ , ఉపాధ్యాయులు ప్రవణ,అమ్మ ఆదర్శ పాఠశాల ఛైర్మన్ లహరి,అంగన్వాడీ స్టాఫ్ సులోచన,బబితా,  హెల్పేర్ షేక్ హుస్సేన్ బీ పాల్గొన్నారు.