అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా 

బోధన్, బతుకమ్మ : మంజీరా సరిహద్దు ప్రాంతం బోధన్ మండలం కల్దుర్కి గ్రామం నుండి ఇసుకను అక్రమంగా అధికలోడుతో తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. అధికారులు  ఇసుక అక్రమ రవాణా విషయమై పర్యవేక్షణకై వస్తున్నారన్న సందేశాన్ని విన్న డ్రైవర్ అతివేగంతో నడుపుతూ మరొక వాహనాన్ని తప్పించబోయి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని అదుపుతప్పి బోర్లా పడింది. డ్రైవర్ ట్రాక్టర్ మీద నుండి పక్కకు దూకేయడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.