డొంకేశ్వర్, బతుకమ్మ : ఈ నెల 23 నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రకంగా జరిగే వేయి గొంతులు లక్ష డప్పుల సన్నాహక సమావేశాన్ని విజయవంతం చెయ్యాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంద కృష్ణ మాదిగ హాజరవుతారని తెలిపారు. ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, అన్ని అనుబంధ సంఘాల డొంకేశ్వర్ మండల విసృత స్థాయి సమావేశం శనివారం మండల కేంద్రంలోని సత్తె గంగవ్వ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు రోడ్డ ప్రవీణ్ మాదిగ అధ్యక్షత వహించారు. ఈ సందర్భాం డొంకేశ్వర్ మండల కమిటీ ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా కొత్తూరు మల్లేష్ మాదిగను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు మాట్లాడారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్ కేంద్రకంగా జరిగే వేయి గొంతుల లక్ష డప్పుల సాంస్కృతిక మహా ప్రదర్శనను విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రజా గాయకుడు, కవి, రచయిత మచ్చ దేవేందర్ మాదిగ హాజరయ్యారు. విశిష్ట అతిథిగా ఎంఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్, నిజామాబాద్ జిల్లా పర్యవేక్షకులు ఇంజం వెంకటస్వామి మాదిగ హాజర్యారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మచ్చ దేవేందర్ మాదిగ మాట్లాడుతూ ” ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సామాజిక న్యాయమని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి చాలా దగ్గర సారూప్యత ఉందని తెలిపారు. తెలంగాణ ఉద్యమం కోసం మాదిగలు ఎలా అయితే కీలక ఉద్యమం చేశారో అలాగే మన జాతి ఉద్యమం కోసం కూడా మంద కృష్ణా మాదిగ పిలుపు మేరకు ఉద్యమం చెయ్యాలని విజ్ఞప్తి చెశారు. ఇంజం వెంకట స్వామి మాదిగ మాట్లాడుతూ ” ఈ నెల 23 నాడు మంద కృష్ణ మాదిగ నిజామాబాద్ జిల్లాకు వస్తున్నారని తెలిపారు. ఆ సన్నాహక ప్రదర్శనను డొంకేశ్వర్ మండలం నుంచి వేలాది మాదిగ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చెశారు. ఈ సమావేశంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు సరికేలా పోశెట్టి మాదిగ, ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ, ఎంఎంఎస్ జాతీయ నాయకులు యమున, సత్తెక్క, ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ టౌన్ అధ్యక్షులు మహేష్ మాదిగ, నిజామాబాద్ జిల్లా కళ మండలి అధ్యక్షులు మహేందర్ మాదిగ, కళ నేతలు డప్పు సంతోష్ మాదిగ, చిట్టి బాబు బుడగ జంగాల, సింగర్ నవీన్ మాదిగ, డొల్లక్ దుశాంత్, పద్మ, శిరీష్ మరియు తదితరులు పాల్గొన్నారు.