ఇంటింటి సమగ్ర సర్వే పక్కాగా నిర్వహించాలి
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : ఇంటింటి సమగ్ర సర్వే పక్కాగా, ఏ ఒక్క ఇళ్లు కూడా తప్పకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం పట్టణంలోని వార్డ్ నెంబర్ 44 ముష్రంభాగ్ ( స్టేషన్ రోడ్డు) లోని సమగ్ర సర్వే తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే లను ప్రభుత్వం జారీచేసిన ప్రశ్నావళి మేరకు మొత్తం సమాచారాన్ని ఆయా కుటుంబాల్లోని ప్రతీ వ్యక్తి...