తెయూ అక్రమ నియామకాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీలో 2012లో జరిగిన అక్రమ నియామకాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్ డిమాండ్ చేశారు. అలాగే అక్రమార్కులకు అండగా ఉంటున్న ప్రస్తుత వీసీ పై కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదు చేయాలన్నారు. ఈమేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2012 సంవత్సరంలో నాటి వి.సి, రిజిస్టర్, ఎలాంటి నియమ,...