బోర్లo ఎస్సీ గురుకుల విద్యార్థి సంగీత మృతి పై సమగ్ర విచారణ చేయాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బోర్లం ఎస్సీ గురుకుల పాఠశాలలో విద్యార్థిని సంగీత మరణంపై సమగ్ర విచారణ జరపాలని భారతీయ విద్యార్థి మోర్చ రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విఠల్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోర్లం ఎస్సీ గురుకుల పాఠశాలలో విద్యార్థి సంగీత మృతి అత్యంత దురదృష్టకరమైన ఘటన అని, రాత్రి సమయంలో విద్యార్థులను బయటకు ఎందుకు పంపించారో స్పష్టమైన సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. విద్యార్థులతో పనులు చేయించటం, శ్రమకు గురి చేయడం అమానుషం, సిగ్గుచేటు అని తీవ్రంగా ఖండించారు....