కామారెడ్డి, బతుకమ్మ : నూతన ఉపాధ్యాయుల ఈఎంపీఐడీలకు డీటీఓ, ఎస్టీఓలలో మొదటి బిల్స్ పాస్ కొరకు వసూళ్లపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ను కోరారు. జిల్లాలో డీసీఈబీ సెక్రటరీగా కొనసాగే వ్యక్తి జీఎచ్ఎం సంఘం అధ్యక్షుడిగా ఉందకూడదని అన్నారు. బీసీ కుల గణనపై ఎస్జీటీ లకు ఒత్తిడి తగ్గించి, గడువు పొడిగించి రెమ్యూనరేషన్ వెంటనే ప్రకటించాలని, సెలవులలో విధులు నిర్వహించిన వారికి సీసీఎల్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎంఎల్సీ ఎన్నికలలో ఎస్జీటీలకు ఓటు హక్కు తక్షణమే కల్పించాలని అన్నారు. ఎఎపీసీ పనులు జిల్లాలో 973 పాఠశాలల్లో జరిగిందని, కేవలం 171 టీయూటీఎఫ్ కామారెడ్డి ఒత్తిడితో నిధులు మంజూరయ్యాయని, అసిస్టెంట్ ఇంజనీర్ ఎంబీ రికార్డులు రాయకుండా నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో చాలావరకు ఎంఈఓల పనితీరు బాగాలేదని, యూనియన్ నాయకులకు సంబంధం లేకుండా తటస్థంగా విధులు నిర్వహించాలని అన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పీఆర్సీ, డీఏలు వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఎండీఎం ఏజెన్సీలకు బిల్లుల చెల్లింపులో జోక్యం లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో చైర్మన్, బిక్కనూర్ యాదయ్య, కే.రమేష్, పి.ప్రవీణ్ కుమార్, జె.హన్మంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.