రక్షిత మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి
-వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్ బతుకమ్మ, నిజామాబాద్ : వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థిని రక్షిత మృతిపై ఉన్నతస్థాయి అధికారి ద్వారా సమగ్ర విచారణ చేపట్టాలని పీడీ ఎస్ యూ, ఏ ఐ ఎస్ ఎఫ్, ఎస్ ఎఫ్ ఐ, ఏ ఐ పీ ఎస్ యూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు బుధవారం నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఏవో కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీ ఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల అజాద్,...