రెండుగా చీలిన మూడవ సొసైటీ
మూడవ కల్లుడిపోలో రెండు గ్రూప్ లు సపరేట్ గా కల్లు విక్రయాలు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కల్లు విక్రయాల్లో పేరు గాంచిన మూడవ సొసైటీ రెండుగా చీలిపోయింది. 2016లో పురుడుపోసుకుని 2017లో ప్రారంభమైన మూడవ కల్లుడిపో కొద్ది కాలంలోనే సొసైటీ రెండు ముక్కలైంది. సొసైటీపై ఒక కుటుంబానికి పెత్తనం దక్కడంతో సొసైటీ ఓ వైపుగా, కార్మికులు మరోవైపుగా చీలిపోయారు. గత కొన్ని రోజులుగా నిజామాబాద్ భవానీ గీత పారిశ్రామిక సహకార సంఘంలో ఉన్న లుకలుకలు బహిర్గతమైన విషయం తెల్సిందే. కల్లుడిపోలో...