Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 May 2025, 2:29 pm Posted by : ramakrishna

అశ్రునయనాలతో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ కు అంతిమ వీడ్కోలు

. నివాళులర్పించిన మంత్రి పొన్నం, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్, ఎంపీ షెట్కార్, ఎమ్మెల్యే

కామారెడ్డి, బతుకమ్మ: ములుగు జిల్లా వాజేబు ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చిన ఘటనలో కన్నుమూసిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర అంత్యక్రియలను ఆయన స్వగ్రామమైన పాల్వంచ మండల కేంద్రంలో అశ్రునయనాలతో గురువారం నిర్వహించారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేశ్ షెట్కార్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తదితరులు శ్రీధర్ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జవాన్ లు, గ్రే హౌండ్స్ దళాలు దేశానికి గర్వకారణమని, గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ చూపిన ధైర్య సాహసాలు చిరస్మరణీయమని అన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటామని అన్నారు.

A tearful farewell to a Greyhounds constable