Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 September 2025, 3:38 pm Posted by : ramakrishna

తెలంగాణ ఆడబిడ్డల చైతన్యానికి ప్రతీక

ఇందల్వాయి, బతుకమ్మ : ధీరత్వానికి, తెలంగాణ నేల పోరాట పటిమకు ఐలమ్మ ప్రతీక అన్నారు.సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, జితేందర్, గ్రామస్తులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరు నవీన్ గౌడ్ మాట్లాడుతూ ధీరత్వానికి, తెలంగాణ నేల పోరాట పటిమకు చాకలి ఐలమ్మ ప్రతీక అన్నారు.భూమి కోసం,భుక్తి కోసం తిరుగుబాటు చేసి నిరంకుశ పాలనపై దండెత్తిన చాకలి ఐలమ్మ పోరాటం,త్యాగం చిరస్మరణీయమన్నారు.1940-44 మధ్య కాలంలో విస్నూర్ లో దేశ్ముఖ్, రజాకర్ల అరాచకాల పై ఎదురు తిరిగి ఎర్రజెండా పట్టి తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాట పటీమ కనబరిచి కీలకంగా వ్యవహరించాన్నారు. చాకలి ఐలమ్మ పట్టుదలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డలు ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ,మున్నూరు కాపు సంఘం గ్రామశాఖ అధ్యక్షులు బైరి రవి,లోకాని గంగారం చాకలి సాయిలు,దేవరి శ్రీకాంత్,జితేందర్, మీసాల గంగాధర్,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.