Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 January 2025, 5:49 pm Posted by : ramakrishna

రేషన్ కార్డుల సర్వే పక్కాగా నిర్వహించాలి  

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లి 8వ వార్డు ఇందిరమ్మ కాలనీ లో స్థానిక కౌన్సిలర్ మెడిదాల సంగీత రవి గౌడ్ ఆధ్వర్యం లో రేషన్ కార్డుల సర్వే నిర్వహించారు. ప్రజా పాలనలో భాగంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారికి మంజూరు చేయాలని తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా  ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి వార్డులో పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ వన్నెలదేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్,ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ ,ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ షైక్ మున్ను భాయ్ గారు,ఆర్మూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ విట్టం జీవన్,ఆర్మూర్ మున్సిపల్ మాజి ఛైర్మెన్ పండిత్ పవన్ ,కౌన్సిలర్ లు హన్మండ్లు ,రవి గౌడ్,ఆర్మూర్ ,మరియు ఆలూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముక్కెర విజయ్,చిన్న రెడ్డి ,కాంగ్రెస్ నాయకులు సునీల్ రెడ్డి,నవీన్ రెడ్డి పాల్గొన్నారు.