బైక్ పై రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యాయత్నం
. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలే కారణం నవీపేట్, బతుకమ్మ: పట్టాలపై బైక్ నడుపుతూ రైలుకు ఎదురెళ్లి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన నవీపేట మండలం దర్యాపూర్ రైల్వే గేటు వద్ద గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పట్టాలపై బైక్ నడుపుతూ నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్ కు ఎదురెళ్లడాన్ని గమనించిన గేట్ మెన్ రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన పోలీసులు రైలును నిలిపివేయించి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. తన పేరు జగదీశ్...