బీసీల స్థితిగతులపై అధ్యయనం జరగాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: బీసీల జనగణన, వారి స్థితిగతులపై అధ్యయనం జరగాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. కలెక్టరేట్ లో మంగళవారం బీసీ కమిషన్ నిర్వహించిన బహిరంగ విచారణలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు. కమిషన్ చైర్మన్ నిరంజన్ కు బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఏర్పడిన తరువాత బడుగు బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందని ఆశించినప్పటికీ అలా జరగలేదన్నారు. రాష్ర్ట ప్రభుత్వం బలహీనవర్గాల సంక్షేమం కోసం పని చేస్తోందని, బీసీ కమిషన్...