నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
స్కూల్ కు వెల్లమన్నందుకు పాఠశాల విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం నిజామాబాద్ లోని మహ లక్ష్మి నగర్ లో జరిగింది. స్థానికంగా మహలక్ష్మి నగర్ లో నివాసం ఉండే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు నవితకు దామేర సాక్షిత్ రెడ్డి (14) తో పాటు మరో కోడుకు, భర్త ఉన్నారు. భర్త, పెద్ధ కోడుకు హైద్రాబాద్ లో ఉండగా నవిత చిన్న కోడుకుతో కలిసి మహలక్ష్మి నగర్ లో నివాసం ఉంటుంది. సాక్షిత్ రెడ్డి వాసవి స్కూల్ లో 8 వ తరగతి చదువుతున్నారు. మహలక్ష్మి టిజిటి ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. స్కూల్ చదువులో వెనకబడినంధుకు సాక్షిత్ రెడ్డిని తల్లి సోమవారం మందలించింది. మంగళవారం ఉదయం తల్లి నమిత విధులకు వేళ్లకముందుకు స్కూల్ కు వేళ్లు మంచిగా చదువుకో అని సూచించింది. కాని తోమ్మిది గంటల ప్రాంతంలో స్కూల్ నుంచి సాక్షిత్ రెడ్డి స్కూల్ కు రాలేదని పోన్ లో సమాచారం అందింది. ఈ విషయంలో ఇంటికి పోన్ చేయగా స్పంధన లేకపోవడంతో తల్లి నమిత తిరిగి ఇంటికి రాగా సాక్షిత్ రెడ్డి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసింది. ఈమేరకు నాల్గవ టౌన్ పోలిసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.