Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 August 2024, 8:01 pm Posted by : ramakrishna

పార్లమెంట్ కాంప్లెక్స్ లో రామారావు మహరాజ్ విగ్రహం ఏర్పాటు చేయాలి

  •  నిజామాబాద్ ఎంపి అరవింద్

               బతుకమ్మ న్యూస్, నిజామాబాద్:
ప్రముఖ అధ్యాత్మిక గురువు 12 కోట్ల బంజారాల అరాధ్య దైవం రామారావు మహరాజ్ విగ్రహంను పార్లమెంట్ కాంప్లెక్స్ లో ఎర్పాటు చేయాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కోరారు. మంగళవారం పార్లమెంట్ లో ఎంపి అర్వింద్ మాట్లాడుతూ కర్నాటకలోని దావేనగరీలో జన్మించిన రామారావు మహరాజ్ సంఘ సంస్కర్తగా, ఆయుర్వేధ వైద్యుడిగా, గిరిజనుల అభ్యున్నతికి జీవితాంతం పాటు పడ్డారని గుర్తు చేశారు. దేశ సంచారీగా లే దే నీ సముహాలతో ఆటవి ప్రాంతాలలో, తాండాలలో నివసించే బంజారాల కోసం ఎనలేని సేవలను చేశారన్నారు. సమా సమాజన స్థాపన కోసం అందరు సమానమే అన్న సిద్ధాంతంను ప్రవచించిన రామారావు మహరాజ్ కు పార్లమెంట్ కాంప్లెక్స్ లో ఇతర మహనీయుల పక్కన విగ్రహం ఎర్పాటు చేయాలని కోరారు. ఆంద్ర, తమీళ నాడు, కర్నాటక, మద్య ప్రదేశ్, మహరాష్ర్ట, తెలంగాణలోని కోట్ల మంది బంజారాల అరాధ్యుడికి సరైన గౌరవ్ం దక్కినట్లు అవుతుందన్నారు.