రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చదివిన (1981-82) బ్యాచ్ కి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో చదువు చెప్పిన గురువులను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా పూర్వ విద్యార్థులంతా ఒకే చోటికి చేరి పాఠశాలల్లో చదువుకున్న తమ తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆట పాటలతో ఆనందంతో గడిపారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు రాష్ట్ర మాజీ కార్యదర్శి పి.రవి కిరణ్, మండల విద్యాధికారి కే. శ్రీనివాస్, పూర్వ విద్యార్ధులు నూత్ పల్లి గణేష్, నారాయణ, ప్రభాకర్, శానం శంకర్, జల్లపురం సాయిలు తదితరులు పాల్గొన్నారు.