డ్రెయినేజీ సమస్య పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి
అన్ని డివిజన్లో సమస్యలను పరిష్కరిస్తా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని డివిజన్లలో డ్రెయినేజీ సమస్య పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, నిత్యం శుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అధికారులను ఆదేశించారు. నాగారం 9వ డివిజన్లో ధన్ పాల్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పర్యటించారు. నగరంలో డ్రెయినేజీ సమస్య కీలకంగా మారిందని, డ్రెయినేజీల్లో చెత్త, నీరు నిల్వ ఉండటం చూసి మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆయన అసహనం...