Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 January 2025, 6:20 pm Posted by : ramakrishna

రక్త బంధం కన్న ఆత్మ బంధం గొప్పది

  • గురుశిష్యుల బంధం మహోన్నతమైనది
  • 22 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం

 

భీమ్‌గల్ , బతుకమ్మ : తల్లిదండ్రులకు, బిడ్డల మధ్య ఉండేది రక్త బంధం, గురువు, శిష్యుల మధ్య ఉండేది ఆత్మ బంధామని, అన్ని బంధాల్లోకెల్లా ఆత్మ బంధమే గొప్పదని కవి కంకణాల రాజేశ్వర్ అన్నారు. ఆదివారం తన అధ్యక్షతన లింబాద్రి గుట్ట సమీపంలోని దశగౌడ్ గెస్ట్ హౌస్ లో జరిగిన 2003-04 ఎస్సేస్సీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.తల్లిదండ్రులు, కన్న బిడ్డల మధ్య ఉండే పేగు బంధంలో స్వార్థం ఉంటుందేమో కానీ ఈ గురు, శిష్యుల మధ్య ఉండే ఆత్మ బందంలో స్వార్థం మచ్చుకు ఉండదన్నారు.తల్లిదండ్రులు గురువులను మరచిన విద్యార్థులు తమ గురువులను ఆజన్మంతం గుర్తుంచుకోంటారని తెలిపారు.
పట్టణం లోని శ్రీభారతీ విద్యాలయంలో చదువుకొన్న ఈ పూర్వ విద్యార్థులు 22 యేండ్ల తర్వాత కలుసుకోవడం మరుపురాని ఘటన అని అభివర్ణించారు. ఈ సందర్బంగా గురువులకు పూర్వ విద్యార్థులు పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి,చదువుల తల్లి సరస్వతి దేవి, పాఠశాల వ్యవస్థాపకులు దివంగత అభిసింగ్ జయంత్ రావు చిత్రపటాలకు పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టారు. తదనంతరం జయంత్ రావు ఆత్మశాంతికై రెండు నిమిషాలు మౌనం పాటించారు. పిమ్మట పూర్వ విద్యార్థులు గురువులందరికీ శాలువా కప్పి జ్ఞాపికను బహుకరించి సత్కరించారు.కుటుంబ సభ్యులతో సహా సాయంత్రం వరకు అమితానందంగా గడిపారు. పూర్వ విద్యార్థుల ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో బొదిరె అశోక్, మేస రాజేశ్వర్, అభిసింగ్ సంగీత, బద్రి జలజ, కవిత, వెంకట్రావు, ప్రకాష్,శారద, దర్ల బాబుల్, రాజేంద్ర బాబు, అమర్ రావు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థుల ప్రతినిధులు నిచ్చెం శ్రీకాంత్, జంబుక శ్రీనివాస్, చెక్కల లింబాద్రి, బొదిరె నరేష్, గుండెం మనోజ్, కుందారం ఈశ్వరి, శెట్టి స్వాతి, కవిత, స్వరూప, బిల్ల హరిత, కొడిగెల శ్రీధర్, నాయుడు శ్రీనివాస్,ఆరె నవీన్, మంద వినోద్, శాంతి లాల్, జి లావణ్య ఎం గంగాధర్, పాల్గొన్నారు.

 

A soul bond is greater than a blood bond