అమరులైన కార్మికులకు ఘనంగా శ్రద్ధాంజలి

బోధన్, బతుకమ్మ : ఏఆర్పి క్యాంప్ గ్రామంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు, యజమాన్యానికి జరిగిన పోరాటంలో పోలీసు కాల్పుల్లో ముగ్గురు కార్మికులు రాజయ్య, రామయ్య, రాములు అమరులయ్యారు. గత 70 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం శుక్రవారం ముగ్గురు కార్మికులకు నివాళులర్పించి మజ్దూర్ సభ, గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో పూలమాలలు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో మజ్దూర్ సభ నాయకులు సత్యనారాయణ స్వామి మాట్లాడుతూ కార్మికులకు, యజమాన్యానికి జరిగిన ఉద్యమంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మద్దూర్ సభ ఆధ్వర్యంలో...