Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 November 2025, 4:50 pm Posted by : ramakrishna

అమరులైన కార్మికులకు ఘనంగా శ్రద్ధాంజలి

బోధన్, బతుకమ్మ : ఏఆర్పి క్యాంప్ గ్రామంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు, యజమాన్యానికి జరిగిన పోరాటంలో పోలీసు కాల్పుల్లో ముగ్గురు కార్మికులు రాజయ్య, రామయ్య, రాములు అమరులయ్యారు. గత 70 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం శుక్రవారం ముగ్గురు కార్మికులకు నివాళులర్పించి మజ్దూర్ సభ, గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో పూలమాలలు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో మజ్దూర్ సభ నాయకులు సత్యనారాయణ స్వామి మాట్లాడుతూ కార్మికులకు, యజమాన్యానికి జరిగిన ఉద్యమంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మద్దూర్ సభ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్మాణం చేపట్టి ప్రతి సంవత్సరం నివాళులర్పిస్తున్నాం అని అన్నారు. అమరవీరుడు రాజయ్య మనుమడు తోట రాజశేఖర్ ఎడి ఈ రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాట్లాడుతూ 1955లో జరిగిన ఉద్యమం భారత కరెన్సీ లో జీతాలు చెల్లించాలని, కార్మికులకు మంచి వసతులు కల్పించాలని ఉద్యమం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మజ్దూర్ సభ కార్మిక నాయకులు సాంబశివరావు, నర్సింలు గౌడ్, మమ్మద్ కాజా, పుల్కా స్వామి, రమేష్, షాబుద్దీన్, గ్రామస్తులు ఎంఏ వాహబ్బారి, టీ.రాజు, నాయిని బలరాం, రామ్ గోపాల్, శ్రీనివాస్ గౌడ్, రాము గౌడ్, ఎండి ఉబేద్, శ్రీనివాస్ గౌడ్  గ్రామస్తులు పాల్గొన్నారు.