పదవీ విరమణ చేసిన సిబ్బందికి ఘన వీడ్కోలు

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మే నెలలో పదవీ విరమణ పొందిన ఆరుగురు సిబ్బందికి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శనివారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. పదవీ విరమణ పొందిన సిబ్బందిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు, శుభాకాంక్షల సర్టిఫికెట్లు అందజేశారు. పదవీ విరమణ పొందిన వారిలో ఆఫీస్ సూపరింటెండెంట్ అహమ్మద్ అబ్దుల్ బషీర్ 41 సంవత్సరాల సేవను పూర్తి చేసి పదవీ విరమణ పొందగా, సీసీఆర్‌బీ ఎస్సై బాదావత్ శివరాం...