Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 March 2025, 3:16 pm Posted by : ramakrishna

ఘనంగా కామ దహనం

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలో బుధవారం రాత్రి కామ దహనం నిర్వహించారు. గాంధీ చౌక్ వద్ద కామ దహనం వేయడానికి ఆవు పిడకలు, గోమయ సమిధులతో పెర్చారు. కామ దహన  కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా మల్లారం శ్రీశ్రీశ్రీ బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ పాల్గొని ఆయన చేతుల మీదుగా కామ దహనం చేశారు. పాటలు పాడుతూ కామ దహనం ఘనంగా నిర్వహించారు. అనంతరం పిట్ల కృష్ణ మహారాజ్ ప్రజలకు ప్రవచనాలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బచ్చు రాము, మాజీ సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్, యోగ కేంద్రం సభ్యులు విశ్వనాథ్ మహాజన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.