ఒకే పోలీస్ విధానం అమలు చేయాలి
. సస్పెన్షన్ ఎత్తివేయాలి . బెటాలియన్ కానిస్టేబుళ్ల ర్యాలీ, వినతిపత్రం అందజేత డిచ్ పల్లి, బతుకమ్మ: రాష్ర్టంలో ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని, సస్పెండ్ చేసిన వాళ్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బెటాలియన్ సిబ్బంది కోరారు. ఈ మేరకు సోమవారం బెటాలియన్ లోపల ర్యాలీ నిర్వహించి కమాండెంట్ కు వినతిపత్రం అందజేశారు. ఉన్నతాధికారుల నుంచి సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు వస్తే స్పష్టత వస్తుందని కమాండెంట్ ఈ సందర్భంగా సిబ్బందికి తెలిపారు.