ముప్కాల్ లో ఎస్సీ కాలనీని సందర్శించిన ఏకసభ్య కమిషన్ 

బాల్కొండ, బతుకమ్మ :  ఎస్సీ ఉపవర్గీకరణపై వివరణాత్మక అధ్యయనం కోసం బహిరంగ విచారణకు విచ్చేసిన రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్‌ గురువారం సాయంత్రం ముప్కాల్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీని సందర్శించారు. స్థానికులను కలిసి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు,ఇతర రంగాలలో ఎంతమంది ఉపాధి పొందుతున్నారు, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది,విదేశాలలో ఉన్నత విద్య కోసం ఓవర్సీస్ పథకం ద్వారా ఎవరైనా...