అటవి భూమి చదును చేసిన నాలుగు ట్రాక్టర్ల సీజ్
బతుకమ్మ, ఇందల్వాయి: ఇందల్వాయి రేంజ్ పరిధిలో ఉన్న దూస్ గాం, బాడ్సి బీట్ లలో 136,138 కంపార్ట్ మెంట్ లో అక్రమంగా చొరబడి అటవీ భూమి దున్నుతున్నారనే సమాచారం మేరకు ఆ ప్రాంతం నుండి 4 ట్రాక్టర్లు పట్టుకుని సీజ్ చేశామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవి మోహన్ బట్ తెలిపారు. అటవి భూమి దున్నుతున్న వ్యక్తులు పారిపోయారని, వారు ఎవరని విచారణ చేపడుతున్నామని అన్నారు. సేఫ్ కస్టడీ కోసం సీజ్ చేసిన వాహనాలు జిల్లా ఫారెస్ట్ ఆఫీసుకు తరలించామని, ఎవరైనా కూడా ఫారెస్ట్...