సౌదీలో రోడ్డు ప్రమాదం.. కులాస్ పూర్ వాసి మృతి
- మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించాలని కోటపాటిని కలిసిన కుటుంబ సభ్యులు నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ మండలం కులాస్ పూర్ గ్రామానికి చెందిన కోర్వ మోహన్(46) సౌదీ అరేబియాలోని తైఫ్ పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మోహన్ మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించాలని బాధిత కుటుంబ సభ్యులు ప్రవాస భారతీయ హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడుని ఆర్మూర్ లో కలిసిన విన్నవించారు. తైఫ్ బల్దియా లో పని చేస్తున్న మోహన్ ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు తమకు...