ఇందల్వాయి, బతుకమ్మ: ఇందల్వాయి మండలంలోని చంద్రయన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల గోల్యా నాయక్ తండాకు చెందిన మోహన్ నాయక్ (43) అనే వ్యక్తి గల్ఫ్ దేశంలోని సౌదీలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత వారం రోజుల క్రితం అతనికి బ్లడ్ క్లాట్ కావడం వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.ఆదివారం రోజు రాత్రి మృతి చెందినట్లు తెలిరు. మృతుడు మోహన్ గత 12 సంవత్సరాల నుండి గల్ఫ్ వెళ్లి వస్తున్నాడని, నాలుగు నెలల క్రితంమే సెలవు పై ఇంటికి వచ్చి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.మృతునికి భార్య నలుగురు కూతుర్లు ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మృతదేహాన్ని త్వరగా ఇంటికి పంపించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.